News November 20, 2024

బిష్ణోయ్ తమ్ముడిని US పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే?

image

అన్మోల్ బిష్ణోయ్ అరెస్టు వ్యవహారంలో కొత్త అప్డేట్. US పోలీసులు అతడిని భారత్‌లో నమోదైన కేసుల్లో అరెస్టు చేయలేదని సమాచారం. అక్రమ పత్రాలతో అమెరికాలో ప్రవేశించడమే అసలు కారణమని తెలిసింది. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధికీ హత్యలు, సల్మాన్ ఇంటిపై కాల్పుల కేసుల్లో అతడు మోస్ట్ వాంటెండ్. కేంద్రం అభ్యర్థించినప్పటికీ US అతడిని భారత్‌కు పంపే అవకాశం లేదని తెలిసింది. అతనిప్పుడు పొటావాటమీ కౌంటీ జైల్లో ఉన్నాడు.

Similar News

News January 21, 2026

9 మంది కూతుళ్ల తర్వాత కొడుకు.. మళ్లీ అక్కడే!

image

ఆడ పిల్లలున్నా మగ సంతానం కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు కొందరు దంపతులు. హరియాణాలోని జింద్(D)లో 10వ ప్రసవంలో కొడుక్కి జన్మనిచ్చిందో మహిళ. ఉచానా కలాన్‌లో సురేంద్ర, రీతుకు ఇప్పటికే 9 మంది కూతుళ్లు ఉండటం గమనార్హం. అమ్మాయిలకు కాఫీ(ఇక చాలు), మాఫీ(క్షమాపణ) పేర్లు పెట్టామని, ఇక తమకు పిల్లలు చాలని రీతు చెప్పారు. ఇటీవల ఉచానాలోనే 10 మంది <<18796058>>ఆడపిల్లలున్న మహిళ<<>> 11వ సారి గర్భం దాల్చి కొడుకుకు జన్మనివ్వడం తెలిసిందే.

News January 21, 2026

విశాఖలో కాగ్నిజెంట్ పనులు వేగవంతం చేయండి: లోకేశ్

image

AP: విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని మంత్రి లోకేశ్ ఆ కంపెనీ CEO రవికుమార్ సింగిశెట్టిని కోరారు. దావోస్‌లో ఆయనతో భేటీ అయిన లోకేశ్.. తాత్కాలిక సౌకర్యాల ద్వారా ఉద్యోగుల సంఖ్యను పెంచే అంశాన్ని పరిశీలించాలన్నారు. Ai, క్లౌడ్, డేటా, డిజిటల్ ఇంజినీరింగ్, CTS నియామక అవసరాలకు కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరారు.

News January 21, 2026

కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకు లాభం

image

నకిలీ, నాణ్యత లేని పురుగు మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే వీటి తయారీ, విక్రయంపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. దీని కోసం ‘పురుగుమందుల నిర్వహణ బిల్లు, 2025’ ముసాయిదాను విడుదల చేసింది. దీని ప్రకారం నకిలీ పురుగు మందులను విక్రయిస్తే రూ.50 లక్షల వరకు జరిమానా, 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్సుంది. కేంద్రం నిర్ణయంలో కీలక అంశాలను తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.