News November 20, 2024

2019లో త‌ప్పిన Exit Polls అంచ‌నాలు

image

2019 మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల Exit Polls అంచ‌నాలు త‌ప్పాయి. ఆ ఎన్నికల్లో BJP-శివ‌సేన కూట‌మి ఘనవిజ‌యం సాధిస్తుంద‌ని 7 సంస్థలు అంచ‌నా వేశాయి. India Today-Axis My India *Patriotic Voter *NewsX-Pollstrat *ABP News-C Voter *Republic Media- Jan Ki Baat *Times Now *News18-IPSOS సంస్థ‌లు BJP కూటమి 288 సీట్ల‌లో 175-243 సీట్లు సాధిస్తుందని అంచ‌నా వేశాయి. అయితే NDA 161, కాంగ్రెస్‌-NCP 98 సీట్లు గెలిచాయి.

Similar News

News November 20, 2024

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

✒ అమరావతి పనులకు కొత్తగా టెండర్లు
✒ రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి SIPB నిర్ణయాలకు ఆమోదం
✒ పీడీ యాక్ట్ పటిష్ఠం చేసే సవరణ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, ఆలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించే చట్టసవరణ బిల్లుకు ఆమోదం
✒ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
✒ ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం
✒ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరణ

News November 20, 2024

చిన్నారులపై లైంగికదాడులు.. కలెక్టర్ కన్నీళ్లు

image

AP: కాకినాడలో విద్యార్థినులను వేధించిన టీచర్, చిన్నారులపై అఘాయిత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షాన్ మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కీచక టీచర్ల గురించి తెలిసికూడా చెప్పకపోతే తప్పు. చేజేతులా పిల్లల జీవితాలను నాశనం చేసినవారవుతారు. నా పేరెంట్స్ టీచర్లు. వాళ్లు కష్టపడి నన్ను ఇంతదాకా తీసుకొచ్చారు. వాళ్లు స్కూల్‌లో డ్యూటీ చేయకపోయినా, వాళ్ల వల్ల పిల్లలు చెడిపోయినా ఆ పాపం మాకు వచ్చేది’ అని పేర్కొన్నారు.

News November 20, 2024

గంభీర్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు: సైమన్ డౌల్

image

భారత కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. గ్రెగ్ చాపెల్ కంటే తక్కువ కాలంలోనే ఉద్వాసనకు గురవుతారని అన్నారు. ‘గంభీర్‌కు అసహనం ఎక్కువ. BGTలో ఎలా ఆడాలన్నదానిపై ఆటగాళ్లను కూర్చోబెట్టి మాట్లాడటం కీలకం. ఈ సిరీస్‌లో ఫలితాలు బాగుంటే ఓకే. ఒకవేళ భారత్ 1-4 లేదా 0-5 తేడాతో ఓడిపోతే ఆయన కోచ్‌గా కొనసాగేది అనుమానమే’ అని స్పష్టం చేశారు.