News November 20, 2024

ప్రాపర్టీ/ రియల్ ఎస్టేట్‌ వైపే ప్రజల మొగ్గు

image

భారతీయ కుటుంబాలు ఈక్విటీ మార్కెట్ల కంటే కూడా సంప్రదాయ పెట్టుబడుల వైపే మొగ్గుచూపుతున్నాయని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. ఇంటిని కలిగి ఉండటమే ప్రధాన ఆస్తిగా భావిస్తున్నారు. దీంతో మొత్తం ఆస్తుల్లో 51.3శాతం ప్రాపర్టీ/ రియల్ ఎస్టేట్ వాటాను కలిగిఉంది. రెండో ప్లేస్‌లో 15.2శాతంతో బంగారం, 13.3% బ్యాంక్ డిపాజిట్స్, 5.8% ఈక్విటీ, 5.7% పెన్షన్ స్కీమ్స్, 3% మంది నగదును కలిగి ఉన్నారు.

Similar News

News February 19, 2026

నెలసరికి ముందు ఇవి మేలు..

image

నెలసరికి ముందు ఆడవారి శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వీటి వల్ల ఒళ్లు బరువుగా ఉండటం, కడుపు నొప్పి, రొమ్ముల సలపరం వేధిస్తాయి. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఈ లక్షణాలు తగ్గించడానికి డైట్‌లో డ్రైఫ్రూట్స్‌, మిల్లెట్స్‌, పెసలు, అలసందలు చేర్చుకోవాలి. శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలు, కూల్ డ్రింక్స్, కాఫీలు ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమస్యలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు.

News February 19, 2026

వాట్సాప్‌లో ఇంటర్ హాల్ టికెట్స్

image

TG: ఇంటర్ హాల్ టికెట్ల డౌన్‌లోడ్ లింక్‌లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపినట్లు బోర్డు వెల్లడించారు. tgbie.cgg.gov.in సైట్ సర్వర్లు బిజీగా ఉంటే ప్రత్యామ్నాయంగా WhatsApp లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సాంకేతిక సమస్యలుంటే కాలేజీ ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న QR Code స్కాన్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూపిస్తుంది. పరీక్షలు ఈనెల 25 నుంచి జరగనున్నాయి.

News February 19, 2026

5,349 పోస్టులకు నోటిఫికేషన్

image

<>RRC<<>> వెస్ట్రన్ రైల్వే పరిధిలో 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 24 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.rrc-wr.com/