News November 20, 2024
మీరు ఏ జనరేషన్‌కు చెందినవారు?
భౌగోళిక అంశాలు, ట్రెడిషన్స్, టెక్నాలజీని బట్టి తరాలకు కాల పరిధులను నిర్ణయించారు. ప్రస్తుతం ఆరో జనరేషన్(ఆల్ఫా) నడుస్తోంది. మిగతా ఐదు జనరేషన్స్ గురించి ఓసారి తెలుసుకుందాం. 1925 నుంచి 1945 మధ్య జన్మించిన వారు సంప్రదాయవాదులు. 1946-1964 మధ్య జన్మించిన వారు బేబీ బూమర్స్, 1965-1980 మధ్య జన్మించిన వారు జెనరేషన్ X, 1981-1996లోపు వారు మిలీనియల్స్, 1997-2012లో జన్మిస్తే జెనరేషన్ Z అని అంటారు.
Similar News
News November 20, 2024
రూ.6600 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్.. మలుపు మలుపుకో ట్విస్ట్ (1)
‘బిట్‌కాయిన్ స్కామ్’ చిన్నదేం కాదు! దీని విలువ ఏకంగా రూ.6600 కోట్లు. మహారాష్ట్ర, పంజాబ్‌లో 40 FIRs నమోదయ్యాయి. 2018లో పుణేలో కేసు నమోదవ్వగానే మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ దుబాయ్‌కు పారిపోయారు. 2022 JANలో ఆయన మరణించారు. దీంతో కుటుంబం మొత్తంపై 2024లో ED ఛార్జిషీట్ వేసింది. 2017లో ఆయన కంపెనీ వేరియబుల్ టెక్ మల్టీలెవల్ మార్కెటింగ్ విధానంలో రూ.6600 కోట్ల BTCలను కలెక్ట్ చేసింది. ఆ తర్వాతేం జరిగిందంటే..
News November 20, 2024
రూ.6600 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్.. మలుపు మలుపుకో ట్విస్ట్ (2)
సాధారణంగా బిట్‌కాయిన్లను వ్యాలెట్లో స్టోర్ చేస్తారు. దర్యాప్తులో తేలిందేమిటంటే రూ.6600 కోట్ల BTCలు అసలు వ్యాలెట్ నుంచి మాయమయ్యాయి. ఇద్దరు పోలీసాఫీసర్లు వీటిని మరో వ్యాలెట్లోకి బదిలీ చేశారని తెలిసింది. మొత్తంగా ఈ స్కామ్‌లో 2 లేయర్లు ఉన్నాయి. మొదటి దాంట్లో అమిత్ వంటివాళ్లు, రెండో దాంట్లో గౌరవ్ మెహతా, సుప్రియా సూలె, నానా పటోలే వంటి నేతలు ఉన్నారని ఆరోపణ. డబ్బులున్న వ్యాలెట్ వీరికి తెలుసని సమాచారం.
News November 20, 2024
AXIS MY INDIA: ఝార్ఖండ్ ‘ఇండియా’దే
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని AXIS MY INDIA అంచనా వేసింది. ఇండియా 53, ఎన్డీఏ 25, అదర్స్ 3 సీట్లు గెలుస్తాయని పేర్కొంది.