News November 20, 2024

సచిన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తారా?

image

మరో రెండు రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలవనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ముంగిట ఉన్న ఓ రికార్డు గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటివరకు సిరీస్‌ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్‌(9) పేరిట ఉంది. ఆయన తర్వాత 8 సెంచరీలతో కోహ్లీ (42మ్యాచ్‌లు), పాంటింగ్ ఉన్నారు. ఈ సిరీస్‌లో కోహ్లీ 2 సెంచరీలు చేస్తే రికార్డును తిరగరాసే అవకాశం ఉంది. మరి ఈ రికార్డును ఆయన తిరగరాస్తారా?

Similar News

News November 27, 2024

ఆర్టీసీ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

image

TG: మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు 1,201 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.

News November 27, 2024

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 85% బోనస్!

image

తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్‌తో ముగిసిన Q2కి మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించింది. ఇది వారి జీతంలో 85% ఉన్నట్లు సమాచారం. నవంబర్ నెల జీతంతో పాటు దీన్ని చెల్లించనుంది. డెలివరీ అండ్ సేల్స్ విభాగంలోని జూనియర్, మిడ్ లెవల్ ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే జనవరి నుంచి జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

News November 27, 2024

తుఫాన్ ముప్పు: 2 రోజులు సెలవులు ఇవ్వాలని వినతి

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ‘ఫెంగల్’ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో నవంబర్ 29, 30న విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని ఏపీ వెదర్‌మ్యాన్ కోరారు. అలాగే నవంబర్ 30న అన్ని కోస్తాంధ్ర జిల్లాల్లో హాలిడే ఇవ్వాలన్నారు. డిసెంబర్ 3 వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.