News November 20, 2024
కరోనా కల్లోలంలోనూ చంద్రబాబు కంటే తక్కువ అప్పులు: జగన్
AP: చంద్రబాబు హయాంలో వార్షిక అప్పుల వృద్ధి రేటు 19.54 శాతం ఉంటే, తమ పాలనలో 13.57 శాతం మాత్రమేనని వైఎస్ జగన్ చెప్పారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయినా పరిమితికి లోబడే అప్పులు చేశామని తెలిపారు. కరోనా కల్లోలంలో దేశ వృద్ధి రేటు కూడా పడిపోయిందని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగం వైసీపీ పాలనలో 9వ స్థానానికి చేరిందని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2024
ఝార్ఖండ్ EXIT POLLS: యాక్సిస్ మై ఇండియా కాన్ఫిడెన్స్ ఏంటి?
ఝార్ఖండ్‌పై ఇప్పటి వరకు 5 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదల చేశాయి. 81 సీట్లున్న ఈ రాష్ట్రంలో BJP కూటమి మ్యాజిక్ ఫిగర్ 41ని దాటేస్తుందని మ్యాట్రిజ్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా ఒక్కటే BJP 25కు పరిమితం అవుతుందని, ఇండియా కూటమి 53 సీట్లతో అధికారం చేపడుతుందని పేర్కొంది. అటూ ఇటూ కాకుండా పక్కాగా సీట్లు అంచనా వేయడంపై నెటిజన్లు సర్‌ప్రైజ్ అవుతున్నారు.
News November 20, 2024
1000మంది ఉద్యోగుల్ని స్పెయిన్ పంపించిన చెన్నై కంపెనీ!
చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ తమ ఉద్యోగులు 1000 మందికి బంపరాఫర్ ఇచ్చింది. అన్ని ఖర్చుల్నీ భరిస్తూ స్పెయిన్‌కు వారం రోజుల టూర్‌కు పంపించింది. ఉద్యోగులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు 2013లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటి నుంచి అనేక దేశాలకు ఉద్యోగుల్ని పంపించామని తెలిపింది. కరోనా సమయంలోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం గమనార్హం.
News November 20, 2024
టాలీవుడ్‌లోకి క్రికెటర్ చాహల్ భార్య ఎంట్రీ?
భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ తెలుగు సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సర్కిళ్లలో ఈ విషయం చక్కర్లు కొడుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఓ పెద్ద సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. రియాల్టీ, డాన్స్ షోల ద్వారా ధనశ్రీ పాపులర్ అయ్యారు.