News November 20, 2024
రాష్ట్ర రోడ్లపై టోల్ వసూలా?.. జగన్ ఆగ్రహం
AP: 2014-19 మధ్య రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం ₹24,792 కోట్లు ఖర్చు చేస్తే YCP హయాంలో ₹43,036 కోట్లు వెచ్చించామని జగన్ తెలిపారు. ఇంత చేసినా CBN, దత్తపుత్రుడు తమపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర రోడ్లపైకి వచ్చే ప్రజల నుంచి <<14653659>>టోల్ వసూలు<<>> చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. ఇదేనా సంపద సృష్టి అని ఫైరయ్యారు. ప్రజలు ట్యాక్స్ కడితేనే రోడ్లు వేస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు.
Similar News
News November 27, 2024
వివాదంలో బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక
బిగ్‌బాస్ ఫేమ్, సీరియల్ నటి ప్రియాంక సరదా కోసం చేసిన పని వివాదానికి దారి తీసింది. తిరుమల నడక మార్గంలో స్నేహితుడితో కలిసి వెళ్తూ తమపై చిరుత అటాక్ చేసిందని పేర్కొంటూ ఇటీవల ఓ ఫ్రాంక్ వీడియో చేశారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యులు సీరియస్ అయ్యారు. వారిద్దరిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భక్తులను కలవరానికి గురిచేసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ వీడియోను తొలగించారు.
News November 27, 2024
ఆర్టీసీ డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ
TG: మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. ఈ మేరకు 1,201 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
News November 27, 2024
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 85% బోనస్!
తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబర్‌తో ముగిసిన Q2కి మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించింది. ఇది వారి జీతంలో 85% ఉన్నట్లు సమాచారం. నవంబర్ నెల జీతంతో పాటు దీన్ని చెల్లించనుంది. డెలివరీ అండ్ సేల్స్ విభాగంలోని జూనియర్, మిడ్ లెవల్ ఉద్యోగులకు బోనస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వచ్చే జనవరి నుంచి జీతాలు పెంచనున్నట్లు తెలుస్తోంది.