News November 20, 2024
ఝార్ఖండ్ Exit Polls: 2019లో ఏం జరిగింది?

ఝార్ఖండ్‌లో 81 సీట్లు ఉన్నాయి. 2019లో JMM 30, BJP 25, CONG 16 సీట్లు గెలిచాయి. అయితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా UPAకు 43, BJPకి 27 సీట్లు వస్తాయంది. ABP VOTER UPA 35, BJP 32 గెలుస్తాయని చెప్పింది. టైమ్స్ నౌ UPAకు 44, BJPకి 28 సీట్లు వస్తాయంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కరెక్టుగానే అంచనా వేశాయి. మరికాసేపట్లో రానున్న 2024 EXIT POLLSను వేగంగా తెలుసుకొనేందుకు WAY2NEWS ఫాలో అవ్వండి.
Similar News
News September 16, 2025
వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సిద్ధం: సీబీఐ

AP: వైఎస్ వివేకా హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. కోర్టు తగిన ఆదేశాలిస్తే ముందుకు వెళ్తామని పేర్కొంది. పిటిషనర్ ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని కోరుతున్నారని చెప్పింది. ఈ మేరకు సీబీఐ అభిప్రాయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు తెలిపారు.
News September 16, 2025
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

TG: రాబోయే 3 గంటల్లో కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, జగిత్యాల, జనగాం, కరీంనగర్, మేడ్చల్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, భువనగిరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News September 16, 2025
రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ‘మిరాయ్’

తేజా సజ్జ నటించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదటి 3 రోజుల్లో రూ.81.2 కోట్లు, నిన్న రూ.10.25 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.