News November 20, 2024
సంపన్నుల మహారాష్ట్రను ఓడించిన భూమిపుత్రుల ఝార్ఖండ్
ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటుహక్కు. దానిని ఉపయోగించుకోవడంలో ఫార్వర్డ్ స్టేట్ మహారాష్ట్ర వెనకబడగా బ్యాక్వర్డ్ స్టేట్ ఝార్ఖండ్ ముందుచూపు కనబరిచింది. అధిక పట్టణ జనాభా, అప్పర్ మిడిల్ క్లాస్, సంపన్నులుండే మరాఠా రాష్ట్రంలో ఓటేసేందుకు ఉత్సాహం చూపించలేదు. గిరిజనులు, గ్రామీణులు అధికంగా ఉండే ఝార్ఖండ్ భూమిపుత్రులు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారు. 3PMకు JHAలో 61%, MHలో 45% ఓటింగ్ నమోదవ్వడమే ఇందుకు ఉదాహరణ.
Similar News
News November 20, 2024
ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం సీరియస్
TG: నారాయణపేట జిల్లాలోని జడ్పీ స్కూల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు.
News November 20, 2024
మరో ఫుడ్ పాయిజన్ ఘటన.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
TG: రాష్ట్రంలో మరో ఫుడ్‌పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని స్కూళ్లలో అసలేం జరుగుతోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
News November 20, 2024
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
* టూరిజానికి పరిశ్రమ హోదా
* విశాఖ, విజయవాడ మెట్రో డీపీఆర్‌కు ఆమోదం
* ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024కు ఆమోదం
* సీఎన్జీపై వ్యాట్ 5శాతానికి తగ్గింపు