News November 20, 2024
విశాఖ: స్టేడియం అభివృద్ధి పనుల పరిశీలన-కలెక్టర్

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గత కొంతకాలంగా సుమారు రూ.7 కోట్ల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. జీవీఎంసీ అధికారులతో కలిసి స్టేడియంను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను గమనించారు.
Similar News
News January 2, 2026
విశాఖ జిల్లాలో 1,232 టన్నుల ఎరువులు సిద్ధం

విశాఖపట్నం జిల్లాలో రబీ సాగుకు అవసరమైన ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వి. ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 6,532 హెక్టార్లలో పంటలు సాగు కాగా, జనవరి చివరి వరకు సరిపడేలా 1,232 టన్నుల ఎరువులు (722 టన్నుల యూరియా సహా) సిద్ధంగా ఉన్నాయన్నారు. మార్క్‌ఫెడ్, రైతు సేవా కేంద్రాల వద్ద నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
News January 2, 2026
జీవీఎంసీ స్థాయి సంఘంలో 109 అంశాలకు ఆమోదం

జీవీఎంసీలో శుక్రవారం స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన 109 అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశంలో ప్రధాన అజెండాలో 87 అంశాలు, 52 టేబుల్ అజెండా అంశాలతో పాటు మొత్తం 139 అంశాలు పొందుపరచగా, వాటిని స్థాయి సంఘం సభ్యులు క్షుణ్ణంగా చర్చించి వివిధ కారణాలు వలన 30 అంశాలు వాయిదా వేశారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి సుమారు రూ.26.46 కోట్ల అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపారు.
News January 2, 2026
విశాఖలో రెండు రోజుల పాటు తెలంగాణ గవర్నర్ పర్యటన

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రెండు రోజుల విశాఖలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం తూర్పు నావికా దళం (ENC) ప్రధాన కార్యాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాత్రి 8.35 గంటలకు ఇండిగో విమానంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.


