News November 20, 2024
గొడవ YCP వాళ్లతోనే.. అదానీ సంస్థతో కాదు: ఆదినారాయణరెడ్డి
AP: జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి YCP నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని BJP MLA ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. నిన్న జరిగిన గొడవ YCP వాళ్లతోనేనని, అదానీతో కాదని, ఆ సంస్థను జమ్మలమడుగుకు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏర్పాటుకాని అదానీ పరిశ్రమకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామణీ అవుతున్న దొంగ దుకాణాలనే తమ వాళ్లు అడ్డుకున్నారని వెల్లడించారు. YCP కంపెనీలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 27, 2024
ఇవాళ ప్రధానితో పవన్ భేటీ
AP: ప్రధాని నరేంద్ర మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ఆయనతో చర్చించనున్నారు. ముఖ్యంగా జలజీవన్ మిషన్ పథకంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, స్కీము పొడిగించాలని ప్రధానిని కోరనున్నారు. తర్వాత పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన సమావేశం కానున్నారు. నిన్న కూడా పలు శాఖల కేంద్ర మంత్రులను కలిసి నిధుల విషయమై చర్చించిన విషయం తెలిసిందే.
News November 27, 2024
డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రూ.196 కోట్లు రిలీజ్
TG: రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం రూ.196 కోట్లు విడుదల చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి వసతుల కొరత ఉంది. ఈ విషయమై స్థానిక నాయకుల నుంచి వస్తోన్న విజ్ఞప్తులతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా మౌళిక వసతులు పూర్తి చేయాల్సిన ఇళ్లు ఇంకా 40 వేలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
News November 27, 2024
శైలజ కుటుంబానికి రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు
TG: ఫుడ్ పాయిజన్తో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన <<14706403>>విద్యార్థిని శైలజ<<>> కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.1.20 లక్షల సాయం అందజేసింది. దీంతో పాటు రెండెకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తానని ఎమ్మెల్సీ విఠల్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ హామీతో గ్రామస్థులు నిన్న శైలజ అంత్యక్రియలు పూర్తి చేశారు.