News November 20, 2024
జన్‌మత్ పోల్స్: రెండు రాష్ట్రాల్లో హంగ్

మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో ‘హంగ్’ పరిస్థితి రావొచ్చని జన్‌మత్ పోల్స్ అంచనా వేసింది. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 130-145, MVA 125-140 సీట్లు గెలవొచ్చని తెలిపింది. పార్టీల పరంగా బీజేపీ 77-82, SS 38-42, NCP 12-15, కాంగ్రెస్ 48-52, SSUBT 37-41, NCP(SP) 38-42, ఇతరులు 15-17 సీట్లు గెలుస్తాయంది. ఝార్ఖండ్‌లో ఎన్డీఏ 41-45, ఇండియా 36-39, ఇతరులు 3-4 సీట్లు గెలవొచ్చని పేర్కొంది.
Similar News
News April 18, 2026
అప్పుడు మహిళలే బిల్లును వ్యతిరేకించారు.. ఎందుకంటే?

మహిళా రిజర్వేషన్లు బిల్లును ఒకప్పుడు మహిళలే వ్యతిరేకించారని తెలుసా? రాజ్యాంగ సభలో భాగమైన రేణుకా రే సహా పలువురు మహిళలు రిజర్వేషన్ వద్దనే వాదనను బలంగా వినిపించారు. అలా చేస్తే మహిళా ప్రాతినిధ్యం కొన్ని సీట్లకే పరిమితం అవుతుందని, జనరల్ సీట్లలో ప్రాధాన్యం తగ్గుతుందని 1947 జులై 18న జరిగిన సభలో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో నెలకొన్న పరిస్థితులు వారి అంచనాలకు భిన్నంగా మారాయి.
News April 18, 2026
NEET అభ్యర్థులకు అలర్ట్

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు మే 3న దేశవ్యాప్తంగా NEET UG-2026 జరగనుంది. 2PM నుంచి 5PM వరకు పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు తప్పనిసరిగా ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తెచ్చుకోవాలని, లేదంటే అనుమతించబోమని NTA తెలిపింది. ఫుల్ స్లీవ్స్ ధరించవద్దని, లైట్, సింపుల్‌గా ఉండే డ్రెస్సులు వేసుకోవాలని సూచించింది. వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని పేర్కొంది.
News April 18, 2026
త్వరలోనే భూముల ధరల పెంపు: పొంగులేటి

TG: రాష్ట్రంలో త్వరలోనే భూముల ధరలను పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. ధరణితో ఏర్పడిన సమస్యలు భూభారతితో పరిష్కారమవుతాయన్నారు. అలాగే రెవెన్యూ శాఖలోనూ కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. భూముల మార్కెట్ విలువను 20 శాతం మేర పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇటీవల <<19616990>>ప్రభుత్వానికి<<>> సిఫారసు చేసింది.


