News November 20, 2024
పర్యాటక ప్రాంతంగా రామతీర్థం..?

ఉత్తరాంధ్రలోనే అతి ప్రధాన దేవాలయంగా రామతీర్థం విరాజిల్లుతోంది. బోడికొండ, దుర్గా భైరవకొండ, గురు భక్తుల కొండలు ఇక్కడ ఉన్నాయి. పాండవులు, బౌద్ధులు సంచరించే ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. పర్యాటక ప్రాంతాల్లో వసతుల కల్పనలో భాగంగా రామతీర్థం పేరును కలెక్టర్ అంబేద్కర్ ప్రకటించారు. తీర్థయాత్ర పర్యాటక ప్రాంతంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 30, 2025
రైలు నుంచి జారిపడి గుర్ల యువకుడి మృతి

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం స్వగ్రామానికి వస్తున్న యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. విజయనగరం (D) గుర్ల (M) గొలగం గ్రామానికి చెందిన కంది సాయిరాం (26) బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బెంగళూరు రైల్వే స్టేషన్ సమీపంలోనే రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులు సాయిరాం కుటుంబ సభ్యులకు మంగళవారం తెలిపారు.
News December 30, 2025
డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు: కలెక్టర్

ఎరువుల విక్రయంలో నిబంధనలు ఉల్లంఘించినా, కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను మళ్లించినా డీలర్లపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం, రాబోయే పంటలకు అవసరమైన ఎరువులను గ్రామ, మండలాల వారీగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వచ్చే 15 రోజులకు అవసరమైన ఎరువుల అంచనాలను తెలియజేయాలన్నారు.
News December 29, 2025
VZM: రెవెన్యూ క్లినిక్‌లకు 23 దరఖాస్తులు

జిల్లాలో సోమవారం ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్ లకు 23 దరఖాస్తులు అందాయి. అందులో విజయనగరం డివిజన్‌కు 15, బొబ్బిలి డివిజన్‌కు 5, చీపురుపల్లి డివిజన్‌కు 3 దరఖాస్తులు అందాయి. వివిధ భూ సమస్యల పరిష్కార నిమిత్తం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకున్నారని ఆయా డివిజనల్ అధికారులు పేర్కొన్నారు. విజయనగరంలో ఆర్డీఓ కీర్తి ధరఖాస్తులు స్వీకరించారు.


