News November 20, 2024
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రక్రియ షురూ!
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల వేళ కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు సీఎం కార్యాలయం నుంచి తాజాగా న్యాయశాఖకు ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో ప్రక్రియను న్యాయశాఖ ప్రారంభించింది. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసులు వివరాలు ఇవ్వాలని కోరారు.
Similar News
News November 21, 2024
రేపటి నుంచి శ్రీశైలంలో ఉచిత బస్సు సదుపాయం
శ్రీశైల క్షేత్రంలో శుక్రవారం నుంచి భక్తులకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు దేవస్థానం ఈవో చంద్రశేఖర ఆజాద్ గురువారం తెలిపారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గణేశ్ సదన్ నుంచి క్యూ కాంప్లెక్స్ వరకు ప్రతి అరగంటకు బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
News November 21, 2024
21 కేసుల్లో దొంగలించిన సొత్తు రికవరీ.. 13 మంది అరెస్టు
కర్నూలు జిల్లాలోని 21 కేసుల్లో దొంగలించిన సొత్తును ఆదోని ఒకటో పట్టణ పోలీసులు రికవరీ చేసి 13 మందిని అరెస్టు చేశారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. రూ.24 లక్షల విలువ గల బైక్‌లను ఇదివరకే రికవరీ చేశారన్నారు. ఈరోజు రూ.41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు. ఆదోని డీఎస్పీ సోమన్న, సీఐ శ్రీరామ్, సిబ్బందిని అభినందించారు.
News November 21, 2024
బనవాసిలో 77 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు: మంత్రి సవిత
ఎమ్మిగనూరు (మం) బనవాసిలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు చేనేత, జౌళి శాఖ 91 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో TDP ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. నిబంధనల మేరకు మూడేళ్లలో ఈ భూమిని వినియోగించకపోవడంతో 2020లో కర్నూలు కలెక్టర్ ఈ కేటాయింపులు రద్దు చేసి, పేదల ఇళ్ల స్థలాలకు 13.96 ఎకరాలను కేటాయించారన్నారు. మిగతా 77 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి పేర్కొన్నారు.