News November 21, 2024
వైరల్: మహేశ్ బాబు ఫ్యామిలీ PHOTO

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సోదరి మంజుల పుట్టినరోజు(NOV 8) సందర్భంగా వీరంతా ఒకే చోట కలవగా ఇవాళ ఫొటో బయటికొచ్చింది. సోదరీమణులు పద్మావతి, ప్రియదర్శిని, బావలు సుధీర్ బాబు, సంజయ్, దివంగత సోదరుడు రమేశ్ భార్య మృదుల, వారి పిల్లలు అంతా సందడిగా గడిపారు.
Similar News
News October 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీ ఇన్‌స్ట్రక్టర్/ విజిటింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవంగల అభ్యర్థులు నవంబర్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bits-pilani.ac.in/
News October 22, 2025
బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్ చేస్తారా.. ప్రభుత్వంపై బండి ఫైర్

TG: ఫీజు బకాయిలు అడిగిన విద్యాసంస్థలను విజిలెన్స్ దాడులతో బ్లాక్‌మెయిల్ చేస్తారా అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బిహార్ ఎన్నికలకు ఇక్కడి నుంచి డబ్బులు పంపే సర్కార్.. విద్యార్థుల భవిష్యత్తు కోసం బకాయిలు చెల్లించలేదా అని ప్రశ్నించారు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడొద్దని, అండగా ఉంటామని విద్యాసంస్థలకు భరోసా ఇచ్చారు.
News October 22, 2025
ఇల్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి: కొలుసు

AP: పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే 50% ఇళ్లు మంజూరు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు వచ్చేనెల 5 వరకు సర్వే నిర్వహిస్తామని, ఇళ్లు లేనివారు అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.28లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించారు. 16నెలల్లోనే రూ.7.65లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై 75.1% ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.