News November 21, 2024
ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసింది వీరే

ఆస్ట్రేలియాలో సిరీస్ గెలవడంలో బౌలర్లది ఎప్పుడూ కీలక పాత్రే. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే BGT గెలవాలంటే భారత బౌలర్లు రాణించాల్సిందే. కాగా.. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లను చూస్తే.. కపిల్ దేవ్-51 వికెట్లు, అనిల్ కుంబ్లే-49, రవిచంద్రన్ అశ్విన్-38, బిషన్ సింగ్ బేడీ-35, జస్ప్రీత్ బుమ్రా-32 వికెట్లు తీశారు. జాబితాలో ఉన్న అశ్విన్, బుమ్రాపైనే భారత జట్టు బౌలింగ్ భారం ఉంది.
Similar News
News April 17, 2026
‘దుష్టచతుష్టయం’ అంటే ఎవరు?

ఎవరైనా నలుగురు కలిసి తప్పుడు కార్యాలు చేస్తున్నప్పుడు వారిని ‘దుష్టచతుష్టయం’తో పోలుస్తాం. రాజకీయాల్లో ఎక్కువగా ఈ పదాన్ని వాడుతుంటారు. మహాభారతంలోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడిని కలిపి దుష్టచతుష్టయం అని మహా కవి తిక్కన ఉద్యోగ పర్వంలో సంబోధించారు. ‘మాయా బజార్’ సినిమా ద్వారా ఈ పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మీ జీవితంలో ఇలా దుష్టచతుష్టయం ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేయండి.
<<-se>>#EPICSAYINGS<<>>
News April 17, 2026
బెస్ట్ కవర్ డ్రైవ్ కోహ్లీదే: సెహ్వాగ్

IPLలో వివిధ షాట్లను ఎవరు ఫర్‌ఫెక్ట్‌గా ఆడతారో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. కవర్ డ్రైవ్- కోహ్లీ, పుల్ షాట్- వైభవ్, ఫ్లిక్ షాట్- ఆయుష్ మాత్రే, స్కూప్ షాట్, స్వీప్ షాట్- సూర్య, స్ట్రెయిట్ డ్రైవ్- సంజూ, ర్యాంప్ షాట్- డివిలియర్స్, రివర్స్ స్వీప్- ప్రభ్‌సిమ్రన్, కట్ షాట్- ప్రియాంశ్, ఇన్‌సైడ్ ఔట్- పడిక్కల్. ఈ లిస్టులో ఎవరైనా మిస్సయ్యారా? కామెంట్ చేయండి.
News April 17, 2026
మోదీని ‘జాదూగర్’ అన్న రాహుల్.. క్షమాపణకు బీజేపీ డిమాండ్

మహిళా రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా PM మోదీని జాదూగర్(మెజీషియన్) అంటూ రాహుల్ గాంధీ చేసిన కామెంట్లతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఆయన ప్రధానిని అవమానిస్తున్నారంటూ BJP సభ్యులు మండిపడ్డారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 140Cr ప్రజలకు ప్రతినిధి అయిన మోదీని ఎగతాళి చేయడం సరికాదని రాజ్‌నాథ్ విమర్శించారు. ఈ క్రమంలో LoP వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.


