News November 21, 2024
సీతారామ ప్రాజెక్ట్ టెండర్ల గడువు పొడిగింపు
సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు కలిపే లింక్ కెనాల్ పనులకు ఇటీవల జలవనరుల శాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. ఈమేరకు గడువు 16వ తేదీతో ముగియగా 25వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. సుమారు రూ.191 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనులకు గత నెల 25న ఆన్‌లైన్లో టెండర్లు ఆహ్వానించగా ఈనెల 8వ తేదీ వరకే తొలుత గడువు విధించారు. ఆతర్వాత 16వ తేదీకి, ఇప్పుడు 25 వరకు పొడిగించారు.
Similar News
News December 26, 2024
కన్నుల పండుగగా రాములోరి నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News December 26, 2024
ఖమ్మం: రైతుల ఖాతాల్లో రూ.368కోట్లు జమ
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్‌తో భరోసా కల్పిస్తోంది. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో 2.01 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడించారు. అటు రైతుల ఖాతాల్లో రూ.368 కోట్లు జమ చేయగా ప్రతీ క్వింటాకు ధరతో సంబంధం లేకుండా రూ.75.32 కోట్లు బోనస్‌గా చెల్లించిందన్నారు. జనవరి చివరి వరకు ధాన్యం సేకరణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
News December 26, 2024
2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి
2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.