News November 21, 2024
NZB: ‘బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలి’
బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. పిల్లల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాలని తెలిపారు.
Similar News
News November 21, 2024
KMR: అధికారులతో కలెక్టర్ వీడియో సమీక్ష
కులగణన సర్వేను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసి, డేటా ఎంట్రీ ప్రారంభించారని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. గురువారం MPDOలు, MROలు, మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పనులు ఎన్యుమరేషన్ బ్లాక్ వారిగా పూర్తిచేసి డేటా నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 11 మండలాల్లో 100%, జిల్లావ్యాప్తంగా 96.3% ఎన్యుమరేషన్ పూర్తయిందన్నారు.
News November 21, 2024
నిజామాబాద్: శిక్షణ పూర్తి చేసుకున్న 250 మంది కానిస్టేబుళ్లు
నిజామాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో సుమారు 250 మంది పోలీసులు తమ శిక్షణను పూర్తి చేసుకున్నారు. జిల్లాలోని ఎడపల్లి మండలంలో గల జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో గురువారం పాసింగ్ అవుట్ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ సింధు శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
News November 21, 2024
ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం మద్నూర్ ఛైర్మన్ ఎన్నిక: CM
మద్నూర్ AMC ఛైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై CM రేవంత్ రెడ్డి ‘X’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ఇంటర్వ్యూ పద్ధతిలో ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ మహిళల చదువుకు ఆత్మస్థైర్యానికి ప్రోత్సహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించిందని’ సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన MLA తోట లక్ష్మీకాంత్ రావు, సహచర మంత్రి వెంకటరెడ్డి, TPCC చీఫ్ మహేశ్ గౌడ్‌లకు అభినందనలు తెలిపారు.