News November 21, 2024

చిత్తూరు: డిసెంబర్ 20 లోపు సీసీ రోడ్లు పూర్తి చేయాలి

image

డిసెంబర్ 20 లోపు సీసీ రోడ్లు పూర్తిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో1500 CC.రోడ్డు పనులు మంజూరు కాగా 1018 పనులు గ్రౌండింగ్ కాబడ్డాయని తెలిపారు. ఇందులో 406 పనులు పూర్తి కాగా 612 పనులు పురోగతిలో కలవని తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే బిల్లులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News February 27, 2026

CTR: వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే రేషన్

image

చిత్తూరు జిల్లాలో 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులతో పాటు అనారోగ్యంతో బాధపడే కార్డుదారులు 46,919 మంది ఉన్నారు. వీరందరికీ గురువారం నుంచే చౌక దుకాణాల డీలర్లు వారి ఇళ్ల వద్దే రేషన్ సరకులు పంపిణీ ప్రారంభించినట్లు డీఎస్వో శంకరన్ తెలి పారు. మార్చి ఒకటి నుంచి సాధారణ కార్డుదారులకు చౌకదుకాణాల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సరకుల పంపిణీ ఉంటుందన్నారు.

News February 27, 2026

చిత్తూరు: రిటైర్డ్ ఉద్యోగులకు అలర్ట్..!

image

ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల జీవన్ ప్రమాణ్ పత్రం సమర్పణకు మిగిలిందిక 2 రోజులే. ఈనెల 28 చివరి రోజు కావడంతో ఆన్లైన్ విధానంలో జీవన్ ప్రమాణ్ యాప్‌లో లైవ్ సర్టిఫికెట్ నమోదు చేయవచ్చు. చిత్తూరు జిల్లాలో పెన్షన్‌దారులు 12,500 ఉండగా గురువారం వరకు 11780 మంది లైవ్ సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు. మరో 720 మంది సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంది.

News February 27, 2026

చిత్తూరు: 129 సెంటర్లలో పది పరీక్షలు

image

ప్రశాంత వాతవరణంలో పది పరీక్షలు నిర్వహణకు సిద్ధం కావాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాలోని 129 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 24,391 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.