News November 21, 2024
కులగణన సర్వే 78% పూర్తి
తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే 78% పూర్తయింది. ములుగు జిల్లాలో సర్వే 100% పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. జనగాం జిల్లాలో 99.9%, నల్గొండలో 97.7% పూర్తయినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా అన్ని జిల్లాల్లో కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News November 21, 2024
10వేల+ అప్లికేషన్స్ వచ్చాయి: జొమాటో CEO
జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్‌కు 10వేల కంటే ఎక్కువ <<14666126>>అప్లికేషన్స్<<>> వచ్చినట్లు సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. ఇందులో రకరకాల వ్యక్తులున్నట్లు తెలిపారు. చాలా డబ్బున్నవారు, కాస్త డబ్బు ఉన్నవారు, తమ వద్ద చెల్లించేందుకు డబ్బులు లేవని చెప్పినవారు, నిజంగానే డబ్బుల్లేని వారు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్లికేషన్‌కు సాయంత్రం 6 వరకే ఛాన్స్ ఉందన్నారు. కాగా ఈ పోస్టు కోసం రూ.20లక్షలు విరాళం ఇవ్వాలి.
News November 21, 2024
అదానీపై కేసు: కాంగ్రెస్‌పై BJP విమర్శలు
NYC కోర్టులో అదానీపై అభియోగాలు నమోదైన నేపథ్యంలో ‘మోదానీ స్కామ్’లపై JPC వేయాలన్న జైరామ్ రమేశ్, కాంగ్రెస్‌పై BJP విరుచుకుపడింది. నేర నిరూపణ జరిగేంతవరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు నిర్దోషులేనని మీరు షేర్‌చేసిన పత్రాల్లోనే రాసుండటం చూడలేదా అని అమిత్ మాలవీయ కౌంటర్ ఇచ్చారు. అందులో ఆరోపించిన రాష్ట్రాలన్నీ కాంగ్రెస్, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలేనన్నారు. ముందు మీరు తీసుకున్న లంచాలకు బదులివ్వాలన్నారు.
News November 21, 2024
శాసనమండలిలో గందరగోళం
AP శాసనమండలిలో మెడికల్ కాలేజీల అంశంపై YCP, కూటమి సభ్యుల మధ్య రగడ నెలకొంది. మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమా? అన్న YCP ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందిస్తూ వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ మాట్లాడుతోందని వ్యాఖ్యానించారు. దీంతో హజ్ యాత్రను ప్రస్తావించడంపై YCP అభ్యంతరం వ్యక్తం చేసింది. తోటి మంత్రులంతా ఆయన వ్యాఖ్యల్లో తప్పేం లేదంటూ మద్దతుగా నిలిచారు.