News November 21, 2024
పుష్ప-2 ‘వైల్డ్ ఫైర్’ ఈవెంట్.. ఎప్పుడంటే?
చెన్నైలో జరిగే ప్రమోషనల్ ఈవెంట్‌పై ‘పుష్ప-2’ మూవీ టీమ్ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 24న తాంబరంలోని సాయి రామ్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ఉన్న లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వైల్డ్ ఫైర్ ఈవెంట్ సా.5 గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.
Similar News
News November 21, 2024
గ్రూప్-2 పరీక్షలపై కీలక ప్రకటన
తెలంగాణలో డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని TGPSC ప్రకటించింది. రోజుకు రెండు సెషన్ల(ఉ.10-12.30, మ.3-5.30 వరకు)లో పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 9 నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదయం 8.30 నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని TGPSC పేర్కొంది. ఇతర వివరాల కోసం 040-23542185 or 040-23542187 నంబర్లకు ఫోన్ చేయండి.
News November 21, 2024
అదానీకి డబ్బు దొరకొద్దు.. అసలు ప్లాన్ ఇదేనా!
నిధుల సమీకరణకు సిద్ధమైన ప్రతిసారీ అదానీ గ్రూప్‌పై US వేదికగా దాడులు జరుగుతున్నాయని SMలో చర్చ జరుగుతోంది. వ్యాపార విస్తరణకు నగదు దొరక్కుండా చేయడమే దీనివెనకున్న ప్లాన్ అని నెటిజన్లు అంటున్నారు. ADANI ENT 2023 JANలో రూ.20వేల కోట్ల FPOకు రాగా హిండెన్‌బర్గ్ దాడిచేసింది. ఇప్పుడు 600 మిలియన్ల డాలర్ బాండ్ల జారీకి సిద్ధమవ్వగా NYC కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఈ 2 ప్లాన్లను అదానీ గ్రూప్ రద్దుచేసుకుంది.
News November 21, 2024
ఖర్చు తగ్గించి, పొదుపు పెంచి..!
స్విట్జర్లాండ్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు లక్షాధికారి, ప్రతి 80వేల మందిలో ఒకరు బిలియనీర్ ఉన్నారు. తక్కువ ఖర్చు, ఎక్కువ పొదుపు చేయడమే ఇందుకు కారణం. స్విస్‌లో ఎక్కువ మంది కిరాయి ఇంట్లో ఉండేందుకు మొగ్గుచూపుతారు. ఎక్కువ రిటర్న్స్ వచ్చేదాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఉన్నవాటినే ఖర్చు చేస్తారు. చదువు, నైపుణ్యాలపై 5-10% ఖర్చు చేస్తారు. వీరు సేవింగ్స్, ఖర్చుల కోసం 3 బ్యాంక్ అకౌంట్స్ వాడతారు.