News November 21, 2024
పెద్దిరెడ్డి తోటలో పోలీసులు గన్స్ పెట్టారు: జగన్

నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్న నాతో చెప్పాడు. ఎస్పీ ప్రోద్బలంతో సీఐ పెద్దిరెడ్డి తోటకు వెళ్లి నాటు తుపాకులు పెట్టారు. అక్కడ పనిచేసే 60 ఏళ్ల వృద్ధురాలిని కొట్టి నేరం ఒప్పించేలా చేశారు. న్యాయమూర్తి వద్ద ఆమె ఈ విషయం చెప్పడంతో సీఐని తిట్టి పంపించారు. వారం క్రితమే ఈ ఘటన జరిగింది’ అని జగన్ అన్నారు.
Similar News
News April 19, 2026
చిత్తూరు: ఇనామ్ భూములకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు

ఇనామ్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 6 వేల ఎకరాలకు విముక్తి కలగనుంది. చిత్తూరులో 358.91, తిరుపతిలో 1950.34 అన్నమయ్య జిల్లాలో 3929.95 ఎకరాల చొప్పున ఇనామ్ భూములు ఉన్నాయి. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
News April 19, 2026
చిత్తూరు జిల్లాలో మండుతున్న ఎండలు

వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా గంగవరం మండలం ఆరంజ్ జోన్‌లో కొనసాగుతోంది. గంగవరంలో 41.2, తవణంపల్లెలో 40.4, శాంతిపురంలో 40.1, రొంపిచెర్లలో 40.0, శ్రీరంగరాజపురంలో 39.8, బంగారుపాళ్యంలో 39.4, నిండ్రలో 39.0, నగరిలో 38.8, పెద్దపంజాణి, పులిచెర్ల, వెదురుకుప్పంలో 38.6, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, యాదమరి, గంగాధర నెల్లూరు, పెనుమూరు, పాలసముద్రంలో 38.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది.