News November 21, 2024
సీఎంకు సోషల్ మీడియా వణుకు: కాటసాని
వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధుల అరెస్టులపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పరోక్షంగా స్పందించారు. టెక్నాలజీని తానే కనిపెట్టానని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సోషల్ మీడియా పేరు చెబితేనే వణికిపోతున్నారని ఆరోపించారు. ఆయనకు నిద్రలేని రాత్రులు పరిచయం చేసిన సోషల్ మీడియా కుర్రాళ్లు.. మున్ముందు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 3, 2024
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఏదో ఒక లింక్ పంపించి, ఆశ చూపడంతో అమాయక యువత వారి ఉచ్చులో పడి నిలువునా దోపిడీకి గురవుతున్నారన్నారు. ఉచితాలకు మోసపోయి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దు అన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే ఘటన జరిగిన వెంటనే బాధితులు 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
News December 3, 2024
కర్నూలు: సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా
కర్నూలు జిల్లాలో ఎల్లుండి నుంచి జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లకు సమాచారం పంపిన ప్రభుత్వం.. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. కాగా, కొద్దిరోజులుగా తుఫాన్, భారీ వర్షాల నేపథ్యంలో సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
News December 3, 2024
సాగునీటి సంఘం ఎన్నికల్లో అన్ని చోట్లా వైసీపీ పోటీ: ఎమ్మెల్యే విరుపాక్షి
సాగునీటి సంఘం ఎన్నికలపై దృష్టి సాధించాలంటూ ఎమ్మెల్యే విరుపాక్షి పేర్కొన్నారు. మంగళవారం ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల వైసీపీ కార్యాలయంలో ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అన్నిచోట్లా వైసీపీ అభ్యర్థులు పోటీలో ఉంటారని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.