News November 21, 2024

BIG ALERT.. భారీ వర్షాలు

image

అండమాన్ సముద్రంలో ఇవాళ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, 26వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది.

Similar News

News December 3, 2024

ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు

image

AP: ఈ నెల 6 నుంచి జనవరి 8 వరకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. గ్రామస్థాయిలో భూవివాదాలను ఈ సమావేశాల్లో పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భూఆక్రమణలు, 22ఏ, ఫ్రీహోల్డ్‌పై ఫిర్యాదులు స్వీకరించనుంది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో షెడ్యూల్ ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

News December 3, 2024

పుష్ప-2కు హైకోర్టులో బిగ్ రిలీఫ్

image

పుష్ప-2ను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ తీశారని శ్రీశైలం అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. సినిమా చూశాకే విడుదలకు సెన్సార్ బోర్డ్ అనుమతించిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వాదించారు. ఊహాజనితంగా తీసిన మూవీ విడుదలను నిలిపివేయలేమని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు సమయం వృథా చేసినందుకు జరిమానా విధిస్తామని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

News December 3, 2024

రెడ్ సీ ఫెస్టివల్‌లో ఆమిర్ ఖాన్‌కు సన్మానం

image

సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సన్మానం జరగనుంది. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్‌తో పాటు ఆమిర్‌ను సత్కరించనున్నట్లు ఫెస్టివల్ నిర్వాహకులు ట్విటర్‌లో తెలిపారు. ఈ నెల 5 నుంచి 14 వరకు ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ నటులు ఆండ్రూ గార్ఫీల్డ్, ఈవా లాంగోరియా, బాలీవుడ్ నుంచి కరీనా కపూర్, రణ్‌బీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.