News November 21, 2024
విశాఖ గ్యాంగ్ రేప్ నిందితులకు రిమాండ్

విశాఖలో లా విద్యార్థిని పై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రేమ పేరుతో వలవేసి బాధితురాలికి చేరువై.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వంశీతోపాటు అతడి స్నేహితులు జగదీశ్, ఆనంద్, రాజేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితులకు వచ్చే నెల 2వరకు రిమాండ్ విధించింది.
Similar News
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ.. 200 ప్రత్యేక బస్సులు

ఈనెల 9న విశాఖలో జరిగే గిరి ప్రదక్షిణకు సింహాచలం కొండకింద నుంచి పైకి వెళ్లేందుకు, మరల పైనుంచి కిందకి వచ్చేందుకు 50 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు మంగళవారం తెలిపారు. సింహాచలం నుంచి నగరంలోకి వచ్చేందుకు 150 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జులై 9, 10వ తేదీల్లో సిబ్బందికి విధించిన డ్యూటీల మేరకు హాజరవ్వాలన్నారు.
News July 8, 2025
ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు

ఎంవీపీ కాలనీ ఒకటో సెక్టార్‌లో ప్రత్యేక ఆకర్షణగా అప్పన్న ఆలయం నమూనా సెట్టు ఏర్పాటు చేశారు. స్థానికంగా కొందరు మిత్రులు కలసి గిరిప్రదక్షిణ భక్తుల కోసం దీనిని నిర్మించారు. ఇందులో వేంకటేశ్వర స్వామి విగ్రహం ఏర్పాటు చేశారు. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఇక్కడ ప్రసాద వితరణతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
News July 8, 2025
గిరి ప్రదక్షిణకు మహా ‘గట్టి’ ఏర్పాట్లు సుమా..!

గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హనుమంతువాక నుంచి వెంకోజీపాలెం వరకూ జాతీయ రహదారిపై పాదచారుల కోసం చేసిన ఏర్పాటు చూస్తే.. చిన్న పాటి కర్ర పాతి, దానికి సన్నని రిబ్బన్ కట్టి, వాహనాలు ఇటు రాకుండా, పాదచారులు అటు వెళ్లకుండా విభజన చేశారు. లక్షల్లో నడిచే ఈ దారిలో ట్రాఫిక్ కూడా ఎక్కువే. ఇంత ‘గట్టి’ ఏర్పాట్లు చేసిన అధికారులను ఎలా అభినందించాలో తెలియడం లేదంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.