News November 21, 2024

అకౌంట్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

AP: 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.

Similar News

News October 26, 2025

KKR హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్!

image

IPL: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త హెడ్ కోచ్‌గా అభిషేక్ నాయర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి BCCI తొలగించాక అభిషేక్ KKR సపోర్ట్ స్టాఫ్‌గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయన హెడ్ కోచ్‌గా ప్రమోట్ అవుతున్నారని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలిపింది. WPLలో UP వారియర్స్‌కు నాయర్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే.

News October 26, 2025

కుక్క కరిచిన నెల తర్వాత చిన్నారి మృతి

image

TG: నిజామాబాద్(D) బాల్కొండకు చెందిన గడ్డం లక్షణ(10) అనే బాలిక కుక్క కరిచిన నెల తర్వాత మరణించింది. కుక్క గీరడంతో ఆమె తలకు గాయమైంది. ఇంట్లో చెబితే తిడతారనే భయంతో చెప్పలేదు. 3 రోజుల క్రితం కుక్కలా అరుస్తూ వింతగా ప్రవర్తించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేబిస్ వ్యాధి తీవ్రమై చనిపోయిందని వైద్యులు తెలిపారు. కుక్క కరిచిన వెంటనే రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News October 26, 2025

అష్ట ధర్మములు ఏవంటే?

image

1. యజ్ఞాలు చేయడం, 2. వేదాలు చదవడం,
3. దానాలు చేయడం, 4. తపస్సు చేయడం,
5. సత్యాన్నే పలకడం, 6. సహనం పాటించడం,
7. కష్ట సమయాల్లో నిలకడ, ధైర్యంగా ఉండటం,
8. వివేకం, ముందుచూపుతో వ్యవహరించడం.
ఈ ఎనిమిది ధర్మాలను పాటించడం వలన మనిషి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, ఆధ్యాత్మిక పురోగతిని సాధిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
<<-se>>#Sankhya<<>>