News November 21, 2024
CTR: 23వ తేదీన జాబ్ మేళా
చిత్తూరు జిల్లా ఇరువారంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)లో 23వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 225 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
Similar News
News December 4, 2024
చిత్తూరులో విషాదం.. 12 ఏళ్ల బాలిక మృతి
బంగారుపాలెంలోని ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. శేషాపురానికి చెందిన గుణశ్రీ జ్వరంతో బాధపడుతుండగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వేశారు. కొంతసేపటికే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2024
తిరుపతిలో 5న జాబ్ మేళా
పద్మావతి పురం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News December 2, 2024
చిత్తూరు: 120 స్మార్ట్ అలారం లాక్ పంపిణీ
టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నెట్టికంటయ్య నగరంలోని పలు ప్రార్ధనా మందిరాలకు 120 స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నియంత్రణకు టూ టౌన్ పరిధిలోని అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదులకు స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. దుకాణా దారులు, ఇంటి యజమానులు సైతం ఈ లాక్ లను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.