News November 21, 2024
విజయవాడ: అరెస్టు భయంతో సూసైడ్
అరెస్ట్ భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన నీలం సూర్యప్రభాస్(21)పై 15 కేసులున్నాయి. భార్య, కుమారుడితో ప్రభాస్ 3 నెలలుగా తిరుపతిలో నివాసం ఉంటున్నాడు. ప్రభాస్‌ను గాలిస్తూ పోలీసులు ఇంటి వద్దకు వెళ్లారు. వారిని చూసి అరెస్టు చేస్తారని భయపడి బుధవారం ఇంట్లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.
Similar News
News December 3, 2024
కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2023 – 24 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 18 – 2025 జనవరి 3 మధ్య నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టువారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడాలని KRU సూచించింది.
News December 3, 2024
విద్యావ్యవస్థకే అతిపెద్ద పండుగ: కలెక్టర్ లక్ష్మి షా
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న పాఠశాల విద్యావ్యవస్థకే అతిపెద్ద పండగగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనుందని కలెక్టర్ లక్ష్మి షా తెలిపారు. మంగళవారం విజయవాడ మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ సన్నద్ధతపై ఎంఈవోలతో పాటు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని డీఈఓ సుబ్బారావు కోరారు.
News December 3, 2024
విజయవాడలో రెండు దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు
విజయవాడలో 2 దశలుగా మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మొదటి దశలో 2 కారిడార్లు, రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా రూపొందించిన DPRను కేంద్రానికి పంపనుంది. మొదటి దశలోని కారిడార్ 1Aలో గన్నవరం-పండిట్ నెహ్రూ బస్టాండ్(PNBS), కారిడార్ 1Bలో PNBS- పెనమలూరు, 2వ దశలోని కారిడార్ 3లో PNBS-అమరావతి మధ్య మెట్రో నిర్మించేలా DPR తయారైందని తెలుస్తోంది.