News November 21, 2024
గ్రూప్-2 అభ్యర్థులకు నమూనా పరీక్షలు
TG: మైనారిటీ అభ్యర్థుల కోసం డిసెంబర్లో గ్రూప్-2 నమూనా పరీక్షలు నిర్వహించనున్నట్లు మైనారిటీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ తెలిపారు. అన్ని జిల్లాల్లో మైనారిటీ సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. DEC 2, 3 తేదీల్లో తొలి నమూనా పరీక్ష, DEC 9, 10 తేదీల్లో రెండో నమూనా పరీక్ష ఉంటుందని చెప్పారు. ఈనెల 29లోగా అప్లై చేసుకోవాలని, వివరాలకు 040-23236112 నంబర్లో సంప్రదించాలన్నారు.
Similar News
News November 21, 2024
CM రేవంత్‌పై పరువు నష్టం దావా విచారణ వాయిదా
TG: సీఎం రేవంత్‌రెడ్డిపై దాఖలైన పరువునష్టం దావా కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. BJPకి ఓటు వేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఎన్నికల సమయంలో రేవంత్ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ BJP నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
News November 21, 2024
డేటింగ్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ‘నా వయస్సు 35ఏళ్లు. నేనింకా సింగిల్ అని మీరు అనుకుంటున్నారా’ అని రిలేషన్షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎంతోకాలంగా తెలిసిన, కోస్టార్‌తోనే డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
News November 21, 2024
అదానీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఒప్పందాలపై ప్రశ్న: జవాబు దాటేసిన రాహుల్
గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. NYC కోర్టులో ఆయనపై అభియోగాలు నమోదవ్వడంపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అదానీతో చేసుకున్న ఒప్పందాలు, ప్రాజెక్టులను సమీక్షిస్తారా అన్న ప్రశ్నకు జవాబు దాటవేశారు. దీనిపై ఝార్ఖండ్‌లో వివరణ ఇచ్చానన్నారు. తాను క్రిమినాలిటీ, మోనోపలీపై మాట్లాడుతున్నానని, అదానీ, అంబానీ సహా ఎవరైనా రూల్స్ పాటించాలన్నారు.