News November 21, 2024

నేడు పలాస రానున్న ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు

image

పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1,353 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నేడు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు రానున్నారు.

Similar News

News November 21, 2024

గార: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న స్కూటీ.. ఒకరు మృతి 

image

గార మండలం వమరవిల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాన్ని స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళితే స్థానిక మండలం తోనంగి గ్రామానికి చెందిన కృష్ణారావు, గణేశ్ గురువారం మధ్యాహ్నం స్కూటీతో అతివేగంతో వెళుతూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ తాకిడికి విద్యుత్ స్తంభం నేలకు ఒరిగింది. ఈ ప్రమాదంలో కృష్ణారావు అక్కడికక్కడే మృతి చెందాడు.

News November 21, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు వినతి.. మంత్రి ఏమన్నారంటే?

image

ఎచ్చెర్లలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరారు. విశాఖకే కాకుండా ఐటీ పార్క్‌ను వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సైతం విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్లకు దగ్గరలో అంతర్జాతీయ విమానశ్రయం, హైవే కనెక్టివిటీ, విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. టైర్2, టైర్ 3 సిటీల్లోనూ ఎకో వర్కింగ్ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News November 21, 2024

ఒక ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్ రూ.2.04 లక్షలా: ఎమ్మెల్యే కూన

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘గోద్రేజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేయకుండా పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల వారు రూ.1.30 లక్షలకే కొన్న రిఫ్రిజిరేటర్లను వైసీపీ వాళ్లు ఏకంగా రూ.2.04 లక్షలతో కొనుగోలు చేశారు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి. వీటిపై విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు.