News November 21, 2024
ADB: పులికి అభయారణ్యంలో అనుకూల వాతావరణం!

ఉమ్మడి జిల్లాలో ఉన్న కవ్వాల్ అభయారణ్యం పెద్ద పులికి పూర్తిస్థాయి ఆవాసంగా మారిందని అధికారులు అన్నారు. గతంలో మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి పెద్ద పులులు వచ్చిపోయేవి. ఈసారి మాత్రం రెండు పులులు వచ్చి ఉంటాయని, అందులో ఒకటి ఉట్నూర్-జోడేఘాట్ మీదుగా తడోబాకు వెళ్లి ఉంటే, మరొక పులి నార్నూర్లో మండలంలో సంచరిస్తూ ఉండవచ్చని అధికారులు తెలిపారు. పులులు నివాసాయోగ్య ప్రాంతాలను వెతుకుతున్నాయని వారన్నారు.
Similar News
News January 17, 2026
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.
News January 17, 2026
ఆదిలాబాద్: భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల ఇంటికే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ADB ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు tgsrtcologistics.co.in వెబ్ సైట్, ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.
News January 16, 2026
ADB రిమ్స్‌లో పోస్టులకు దరఖాస్తులు

ADB రిమ్స్ వైద్య కళాశాలలో వివిధ విభాగంలో డాక్టర్ పోస్టులను గౌరవ వేతనంతో పాటు కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. అర్హులైన ట్యూటర్స్, సీఎంఓ, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సీనియర్ రెసిడెంట్స్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. వివరాలకు rimsadilabad.org, adilabad.telangana.gov.in వెబ్‌సైట్లను సంప్రదించాలన్నారు. ఈ నెల 23న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.


