News November 21, 2024

ఐదు నెలల్లో 25,000 కిలోల గంజాయి స్వాధీనం: మంత్రి అనిత

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 25వేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీలో ప్రకటించారు. గంజాయిపై జరుగుతున్న చర్చలో ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో స్కూల్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడడం విచారించదగ్గ విషయంగా పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామన్నారు.

Similar News

News February 2, 2025

ఢిల్లీ ఎన్నికల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం

image

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలోని షాలిమార్ ప్రాంతంలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలో ప్రచారం చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించారు.

News February 2, 2025

GVMC టీడీఆర్‌లలో భారీ కుంభకోణం: మూర్తి యాదవ్

image

జీవిఎంసీలో టీడీఆర్‌ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో వందల కోట్లు అక్రమ టీడీఆర్‌లు పొందిన వారు.. ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కూటమి నేతలను ప్రలోభాలు పెట్టి.. జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.

News February 2, 2025

GVMCలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తాత్కాలిక రద్దు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా GVMCలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.