News November 21, 2024
కెప్టెన్సీపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
BGT తొలి టెస్టుకు టీమ్ ఇండియా కెప్టెన్‌గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నట్లు జస్ప్రీత్ బుమ్రా తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ‘రోహిత్, కోహ్లీ కెప్టెన్సీ స్టైల్స్ వేర్వేరుగా ఉంటాయి. నేనూ నా సొంత శైలిలో బాధ్యతలు నిర్వర్తిస్తా. టీమ్ కాంబినేషన్‌ను ఇప్పటికే ఫైనల్ చేశాం. రేపు మ్యాచుకు ముందు ప్రకటిస్తాం’ అని తెలిపారు. అన్నీ అనుకూలిస్తే ఈ సిరీస్‌లో షమీ కూడా ఆడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2024
అదానీ స్కాం: ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అభియోగాలు!
AP: అదానీపై అమెరికా మోపిన అభియోగాల్లో గత ప్రభుత్వం పేరు కూడా ఉంది. ఆనాటి ఏపీ ప్రభుత్వానికి రూ.1,750 కోట్ల లంచం ఇచ్చి సౌర విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 2021లో అదానీ అప్పటి సీఎం జగన్‌ను కలిసిన తర్వాత ‘సెకీ’ ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. అదానీ పవర్ నుంచి కొన్న విద్యుత్ ఏపీకి ఇవ్వాలని ‘సెకీ’ నిర్ణయించినట్లు వివరించారు.
News November 21, 2024
₹కోటి ఇవ్వాలంటూ ‘అమరన్’ మేకర్స్‌కు స్టూడెంట్ నోటీసులు
శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మేకర్స్‌కు ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ లీగల్ నోటీసులు పంపించారు. తన అనుమతి లేకుండా సినిమాలో తన ఫోన్ నంబర్ చూపించారని, దీంతో తనకు గుర్తు తెలియని వారి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. తనకు నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News November 21, 2024
పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి
AP: రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. వైసీపీ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.