News November 21, 2024
HYD: రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు

HYD నగరంలో శుక్రవారం రాష్ట్రపతి పర్యటన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్ఐఏ నుంచి ఐకియా వరకు, కేబుల్ బ్రిడ్జి నుంచి మీనాక్షి వరకు, మాదాపూర్ నుంచి కొత్తగూడ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.
Similar News
News September 19, 2025
కోకాపేట్లో భర్తను చంపిన భార్య

కోకాపేట్లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.
News September 19, 2025
HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.
News September 19, 2025
22 నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మకు పల్లకి, పవళింపు సేవ

దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయంలో ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉ.3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం చేస్తారు. ప్రతిరోజు రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తికి పల్లకి, పవళింపు సేవ చేయనున్నారు.