News November 21, 2024

మీ ఇంట్లోకి టీవీ ఎప్పుడొచ్చింది?

image

ఓ పాతికేళ్లు వెనక్కి వెళ్తే.. అప్పట్లో ఊరికి ఒకట్రెండు ఇళ్లలోనే టీవీ ఉండేది. సాయంత్రం కాగానే టీవీ ఉన్న వాళ్ల ఇంటికి చూడటానికి వెళ్లేవారు. అప్పట్లో ఆ బ్లాక్&వైట్ టీవీ చూస్తేనే అదో పెద్ద గొప్ప. మిలీనియల్స్‌కి ఇది బాగా అనుభవం. ఆ తర్వాత కొన్నేళ్లకు క్రమంగా అందరూ టీవీలు కొనడం మొదలుపెట్టారు. ఇప్పుడు టీవీ లేని ఇల్లే లేదు. ఇంతకీ మీ ఇంట్లో టీవీ ఎప్పుడు కొన్నారు? కామెంట్ చేయండి.
> నేడు వరల్డ్ టెలివిజన్ డే

Similar News

News November 21, 2024

జొమాటోలో డ్రగ్స్ అమ్మకం.? సంస్థ స్పందన ఇదే

image

జొమాటోలో కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ ఐటెమ్స్ పేరిట మత్తు పదార్థాల్ని విక్రయిస్తున్నాయన్న ఆరోపణలపై జొమాటో తాజాగా స్పందించింది. ‘అలాంటి రెస్టారెంట్లను గుర్తించి ఇప్పటికే ఓ జాబితాను రూపొందించాం. వాటిని జొమాటో నుంచి తొలగిస్తున్నాం. మా యాప్‌లో రిజిస్టర్ అయ్యే అన్ని సంస్థలకూ FSSAI లైసెన్స్ ఉండాల్సిందే. మద్యం, సిగరెట్లు, వేప్స్ వంటివి విక్రయించేవారిని బ్లాక్ చేస్తున్నాం’ అని స్పష్టం చేసింది.

News November 21, 2024

టెస్టు సిరీస్‌కు రోహిత్ వచ్చేస్తున్నారు!

image

ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్టుకు రోహిత్ శర్మ మిస్ అయిన సంగతి తెలిసిందే. అయితే తొలి టెస్టు మూడో రోజు సమయానికి ఆయన జట్టుతో జాయిన్ కానున్నారు. ఈ నెల 24కి శర్మ ఆస్ట్రేలియా చేరుకుంటారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రెండో టెస్టు నుంచీ ఆయన ఆడనున్నారు. బిడ్డ పుట్టిన కారణంగా ఆయన ముంబైలోనే ఉండిపోయారు.

News November 21, 2024

ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్: సీఎం చంద్రబాబు

image

AP: రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని CM చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. పోలీసుల కోసం 2వేలకు పైగా కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పోలీస్ శాఖకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేశారు.