News November 21, 2024
పేసర్లు కెప్టెన్‌గా ఉండాలి: బుమ్రా
BGT నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ బుమ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నేనెప్పుడూ పేసర్లు కెప్టెన్‌గా ఉండాలని వాదిస్తా. వారు వ్యూహాత్మకంగా మెరుగ్గా ఉంటారు. గతంలోనూ ఎన్నో ట్రోఫీలు ఇండియా గెలిచింది. ఈసారి పేసర్ కెప్టెన్సీలో కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది అనుకుంటున్నా’ అని తెలిపారు. 2017, 2019, 2021, 2023లో ఇండియా BGT గెలుపొందింది. కాగా, ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు దిగిన ఫొటో వైరలవుతోంది.
Similar News
News November 23, 2024
అమెరికా టీవీ ఛానల్ కొనుగోలు చేయనున్న మస్క్?
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ MSNBCని కొనుగోలు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. MSNBC అమ్మకానికి ఉందన్న ఓ పోస్టుకు జూనియర్ ట్రంప్ స్పందిస్తూ మస్క్‌ను అడిగారు. దీనిని ఎంతకు అమ్ముతున్నారంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ప్రముఖ పాడ్‌కాస్టర్ జో రోగన్ కూడా ఇది ఓకే అయితే తాను ఓ షో చేస్తానని చెప్పడంతో దీనిని తప్పకుండా చేయాలంటూ జూ.ట్రంప్ చెప్పడంతో డీల్ డన్ అంటూ మస్క్ హామీ ఇచ్చారు.
News November 23, 2024
వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై
AP: వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు. కాగా కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పనిచేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.
News November 23, 2024
ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. JMM-కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారం చేపట్టడానికి అవసరమైన 41 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. ప్రస్తుతం 51 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి. అయితే ఈనెల 20న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఝార్ఖండ్‌లో కమలం వికసిస్తుందని జోస్యం చెప్పాయి. మై యాక్సిస్ ఇండియా మినహా అన్ని సంస్థలూ NDAకే పట్టం కట్టాయి. కానీ ఇవాళ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.