News November 21, 2024

గంజాయి పండించినా, తరలించినా పీడీ యాక్ట్: హోంమంత్రి

image

AP: గంజాయి సాగు చేసినా, తరలించినా పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయిపై సభ్యుల ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ‘5 నెలల్లో 25వేల KGల గంజాయి పట్టుకున్నాం. ఐదేళ్లలో జగన్ గంజాయిపై సమీక్ష చేయలేదు. గతంలో బ్లేడ్, గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోయాయి. యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్‌తో నేరస్థులను అణచివేస్తాం’ అని ఆమె స్పష్టం చేశారు.

Similar News

News November 21, 2024

భూమిని ఆక్రమిస్తే బయట తిరగలేరు: సీఎం చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూఆక్రమణలకు పాల్పడ్డారని CM చంద్రబాబు అసెంబ్లీలో ఆరోపించారు. ఆ చట్టాన్ని రద్దు చేశాం కానీ జరిగిన అవకతవకలను ఏమీ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్-2024 పేరుతో కఠిన చట్టాన్ని తీసుకొస్తున్నాం. ఇకపై ఎవరైనా భూమిని ఆక్రమిస్తే ఆరు నెలల్లోనే శిక్ష పడేలా చేస్తాం. వాళ్లు ఇక బయట తిరగలేరు’ అని హెచ్చరించారు.

News November 21, 2024

ఉద్యోగులకు భారీ షాకివ్వనున్న ఓలా ఎలక్ట్రిక్!

image

ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకివ్వనుందని సమాచారం. 500 మందికి పైగా తొలగించనుందని తెలుస్తోంది. మార్జిన్లను మెరుగుపర్చుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. అందుకే రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఆరంభించినట్టు తెలిసింది. 2022, సెప్టెంబర్, జులైలోనూ కంపెనీ రెండుసార్లు ఇలాగే చేసింది. యూజుడ్ కార్స్, క్లౌడ్ కిచెన్, గ్రాసరీ డెలివరీ యూనిట్లను మూసేసి 1000 మందిని ఇంటికి పంపించేసింది.

News November 21, 2024

హోంమంత్రికే రక్షణ లేకపోతే ఎలా?: సీఎం చంద్రబాబు

image

AP: తల్లి, చెల్లిని SMలో అసభ్యంగా దూషించినా గత సీఎం పట్టించుకోలేదని CM చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రస్తుతం హోంమంత్రి, డిప్యూటీ సీఎంపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఎవరికుంటుంది? కొందరికి డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయింది. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.