News November 21, 2024
కౌలు రైతుల సమస్యలపై మండలిలో ప్రశ్నించిన MLC కేఎస్

కౌలు రైతులకు రుణాలు అందకపోవడం అనేది సామాజిక సమస్య అని గుంటూరు, కృష్ణా పట్టభధ్రుల MLC లక్ష్మణరావు శాసనమండలిలో అన్నారు. APలో 26 లక్షల మంది కౌలు రైతులున్నారని చెప్పారు. భూయజమాని సంతకం ఉంటేనే రుణ అర్హత కార్డులు ఇస్తామనే నిబంధనతో చాలామంది నష్టపోతున్నారని చెప్పారు. భూమి మీద యజమానికి, పంట మీద కౌలు రైతుకి రుణాలు ఇవ్వడం మంచిదని సూచించారు. కులాన్ని బట్టి కాకుండా రైతులందరికీ రుణ అర్హత కార్డులివ్వాలన్నారు.
Similar News
News November 8, 2025
GNT: 19ఏళ్లలో 500 చిత్రాల్లో నటించిన గొప్ప నటుడు

తెలుగు చిత్ర హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు AVSగా పేరు గాంచిన ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం గుంటూరు (D) తెనాలిలో జన్మించారు. ఆంధ్రజ్యోతిలో పాత్రికేయుడుగా కేరీర్ ప్రారంభించిన AVS, మిస్టర్ పెళ్లాం సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. 19ఏళ్లలో AVS 500 చిత్రాల్లో నటించాడు. అంకుల్ సినిమాతో ఆయన నిర్మాతగా కూడా మారారు. ఆయనకు తన కుమార్తె లివర్ దానం చేశారు. కాగా నేడు NOV 8 ఆయన వర్ధంతి.
News November 8, 2025
నేడు టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శనివారం కేంద్ర కార్యాలయాన్ని సందర్శించనున్నారు. ఆయన పార్టీ కార్యకర్తల నుంచి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చర్చించనున్నారు. అలాగే, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ కూర్పు వంటి ముఖ్య అంశాలపై ఆయన పార్టీ నేతలతో చర్చలు జరపనున్నాయి.
News November 8, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్పీ

గుంటూరులో నిర్వహించిన పోలీసు సిబ్బంది గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ 13 వినతులను స్వీకరించారు. బదిలీలు, ప్రమోషన్లు, క్వార్టర్స్ కేటాయింపు, వైద్య సాయం వంటి పలు అంశాలపై వినతులు వచ్చాయి. వీటిని నిష్పాక్షికంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.


