News November 21, 2024
ఖర్చు తగ్గించి, పొదుపు పెంచి..!
స్విట్జర్లాండ్‌లో ప్రతి ఏడుగురిలో ఒకరు లక్షాధికారి, ప్రతి 80వేల మందిలో ఒకరు బిలియనీర్ ఉన్నారు. తక్కువ ఖర్చు, ఎక్కువ పొదుపు చేయడమే ఇందుకు కారణం. స్విస్‌లో ఎక్కువ మంది కిరాయి ఇంట్లో ఉండేందుకు మొగ్గుచూపుతారు. ఎక్కువ రిటర్న్స్ వచ్చేదాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సేవ్ చేసిన తర్వాత ఉన్నవాటినే ఖర్చు చేస్తారు. చదువు, నైపుణ్యాలపై 5-10% ఖర్చు చేస్తారు. వీరు సేవింగ్స్, ఖర్చుల కోసం 3 బ్యాంక్ అకౌంట్స్ వాడతారు.
Similar News
News November 21, 2024
చైనా మాస్టర్స్‌లో పీవీ సింధు ఓటమి
భారత షట్లర్లు పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ చైనా మాస్టర్స్ టోర్నీలో రెండో రౌండ్లో వెనుదిరిగారు. సింగపూర్‌కు చెందిన యెవో జియా మిన్ చేతిలో సింధు 16-21, 21-17, 21-23 తేడాతో ఓడిపోగా అనుపమ జపాన్ క్రీడాకారిణి నత్సుకీ నిడైరాతో 21-7, 21-14 తేడాతో ఓటమిపాలయ్యారు. సింధు ఈ ఏడాది వరుసగా 7 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ కూడా దాటకపోవడం గమనార్హం.
News November 21, 2024
BREAKING: అదానీకి కెన్యా భారీ షాక్
అదానీ గ్రూప్‌తో కుదుర్చుకున్న రెండు భారీ ప్రాజెక్టులను రద్దు చేస్తున్నట్లు కెన్యా ప్రకటించింది. పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మించేందుకు 700 మిలియన్ డాలర్ల ఎనర్జీ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు విలియం రుతో వెల్లడించారు. దాంతో పాటు JKI విమానాశ్రయాన్ని విస్తరించేందుకు జరుపుతున్న ప్రణాళికలను నిలిపివేస్తున్నామన్నారు. కాగా అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
News November 21, 2024
కొడుకు కాపురంపై స్పందించిన అమితాబ్
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ వైవాహిక జీవితం సరిగా లేదంటూ వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. వాటిపై అమితాబ్ బచ్చన్ తన బ్లాగులో పరోక్షంగా స్పందించారు. ‘ఊహాగానాలెప్పుడూ ఊహాగానాలే. అవాస్తవాలే. వాటికి ఎటువంటి ఆధారాలు ఉండవు. ధ్రువీకరణ కాని సమాచారాన్ని ప్రశ్నార్థకం పెట్టి రాసేస్తుంటారు. అది ఎవరి గురించైతే రాశారో వారి జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో పట్టించుకోరు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.