News November 21, 2024
10వేల+ అప్లికేషన్స్ వచ్చాయి: జొమాటో CEO

జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్‌కు 10వేల కంటే ఎక్కువ <<14666126>>అప్లికేషన్స్<<>> వచ్చినట్లు సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. ఇందులో రకరకాల వ్యక్తులున్నట్లు తెలిపారు. చాలా డబ్బున్నవారు, కాస్త డబ్బు ఉన్నవారు, తమ వద్ద చెల్లించేందుకు డబ్బులు లేవని చెప్పినవారు, నిజంగానే డబ్బుల్లేని వారు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్లికేషన్‌కు సాయంత్రం 6 వరకే ఛాన్స్ ఉందన్నారు. కాగా ఈ పోస్టు కోసం రూ.20లక్షలు విరాళం ఇవ్వాలి.
Similar News
News January 14, 2026
20న BJP అధ్యక్షుడిగా నబీన్ బాధ్యతలు

BJP జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. 19న నామినేషన్ల ప్రక్రియ జరగనుండగా, అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే బరిలో నిలవనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అదే విధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న అతి పిన్న వయస్కుడిగా (46) రికార్డు సృష్టించనున్నారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి PM మోదీతో పాటు ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
News January 14, 2026
పీఎఫ్ పెన్షనర్లకు ఇంటివద్దే లైఫ్ సర్టిఫికెట్

EPFO పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇకపై డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కోసం బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో ఈ సేవను ఉచితంగా ఇంటి వద్దే అందుబాటులోకి తెచ్చింది. పోస్ట్‌మ్యాన్ ఇంటి వద్దకే వచ్చి ఆధార్, ఇతర వివరాలు పరిశీలించి బయోమెట్రిక్ ద్వారా సర్టిఫికెట్ అప్‌లోడ్ చేస్తారు. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్ద ఉపశమనం.
News January 14, 2026
సంక్రాంతి సందడి.. పందెం కోళ్లు రె’ఢీ’

AP: సంక్రాంతి పండుగ వేళ కోడిపందేల సందడి మొదలు కానుంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఉబయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో బరుల ఏర్పాట్లు చేశారు. మారుమూల ప్రాంతాలు, జిల్లా సరిహద్దుల్లో పందేలకు ఏర్పాట్లు చేస్తుండగా, వారిని కట్టడి చేసేందుకు పోలీసులు డ్రోన్లతో నిఘా పెంచారు. అయినా నిర్వాహకులు ఎక్కడా తగ్గడం లేదు. కోట్ల రూపాయల పందేలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలలో ఉండే హోటళ్లు హౌస్‌ఫుల్ అయ్యాయి.


