News November 21, 2024
‘OTT’ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన ప్రసార భారతి
ప్రసార భారతి తన కొత్త OTT స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ‘WAVES’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్లు, లైవ్ ఈవెంట్స్, గేమ్స్, ఎడ్యుకేషన్ మెటీరియల్తో సహా వినోదం అందించే కార్యక్రమాలు నిర్వహించనుంది. ONDC పర్యవేక్షణలో ఉన్న ఈ యాప్లో 12 కంటే ఎక్కువ భాషలు అందుబాటులో ఉంటాయి. BSNLతో పాటు DDని కేంద్రం అభివృద్ధి చేస్తుండటంపై నెట్టింట ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
Similar News
News November 25, 2024
తొలి రోజు అన్సోల్డ్ ప్లేయర్లు వీరే..
తొలి రోజు IPL మెగా వేలంలో దేవదత్ పడిక్కల్, డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, వాకర్ సలామ్ కీల్, పియూష్ చావ్లా, కార్తీక్ త్యాగి, యశ్ దుల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఉత్కర్ష్ సింగ్, లవ్నీత్ సిసోడియా, ఉపేంద్ర సింగ్ యాదవ్, శ్రేయస్ గోపాల్ అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలారు. అత్యధికంగా పంజాబ్(PBKS) 10 మంది ప్లేయర్లను వేలంలో దక్కించుకోగా అత్యల్పంగా ముంబై ఇండియన్స్ నలుగురిని కొనుగోలు చేసింది.
News November 25, 2024
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల ఏడుపు: మంత్రి శ్రీధర్ బాబు
TG: అధికారం పోయిందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తమది చేతల ప్రభుత్వమని, ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేరుస్తామని చెప్పారు.
News November 25, 2024
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలు కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ సమావేశాలు సాగనున్నాయి. ఈ సెషన్లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండగా వక్ఫ్ సహా 16 బిల్లులపై చర్చించనున్నారు. సభలో చర్చించే అంశాలపై లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్ పర్సన్ ఆమోదం తర్వాతే పార్లమెంటులో చర్చ జరుగుతుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.