News November 21, 2024
పీఏసీ ఛైర్మన్గా పులపర్తి
AP: రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ఛైర్మన్గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. వైసీపీ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News November 23, 2024
తల్లిని కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకునే ఉడతలు!
మాతృత్వం ఏ జీవిలోనైనా ఒకేలా ఉంటుందని వర్సిటీ ఆఫ్ గ్వెల్ఫ్ పరిశోధనలో తెలిసింది. అల్బెర్టా విశ్వవిద్యాలయం& మెక్గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులతో కలిసి 20 ఏళ్లు పరిశోధన చేసింది. ఆహారం కోసం గొడవకు దిగే ఉడతలు తల్లిని కోల్పోయిన ఉడత పిల్లలను దత్తత తీసుకొని వాటికి తోడుగా ఉంటాయని గుర్తించింది. ముఖ్యంగా ఎర్ర ఉడతలు ఇందుకు ముందుంటాయని వెల్లడైంది. ఇలా ఇతర పిల్లలను తమవాటిలా చూసుకోవడం కూడా అరుదేనని తెలిపింది.
News November 23, 2024
ప్రియాంక ఫొటోకు పాలాభిషేకం
TG: వయనాడ్ (కేరళ) ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఇతర నాయకులు గాంధీభవన్లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రియాంక యావత్ భారత దేశంలో తిరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వీహెచ్ తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ డబ్బుల ప్రభావంతో గెలిచిందని, అది అంబానీ-అదానీల గెలుపని ఆరోపించారు.
News November 23, 2024
అల్పపీడనం ఎఫెక్ట్.. APకి భారీ వర్షసూచన
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. నవంబర్ 25న అల్పపీడనం వాయుగుండంగా బలపడి కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు పడతాయని వివరించింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.