News November 21, 2024
మండలానికి 2 అంబులెన్సులు: మంత్రి రాజనర్సింహ

TG: రాష్ట్రంలోని ప్రతి మండలంలో రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంచిర్యాలలో ఆయన మాట్లాడారు. ‘మండల కేంద్రంలోనే రోగికి 90 శాతం చికిత్స జరగాలి. రోగులను వైద్యులు తమ క్లయింట్లుగా భావించాలి. రాష్ట్రంలో ఇప్పటికే 7 వేలకుపైగా నర్సు పోస్టులు భర్తీ చేశాం. ఇకపై మెడికల్ స్టాఫ్ కొరత ఉందని, అందుబాటులో లేరనే విమర్శలు రావొద్దు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
పాక్‌లో రేపు చర్చలు.. డీల్ చేసుకోవాల్సిందే: ట్రంప్

ఇరాన్‌తో చర్చలకు తమ బృందం రేపు సాయంత్రానికి పాకిస్థాన్ చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. డీల్ కుదుర్చుకోకపోతే ప్రతీ పవర్ ప్లాంట్, బ్రిడ్జ్‌లను ధ్వంసం చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. హార్ముజ్‌లో ఫ్రెంచ్, యూకే నౌకలపై ఇరాన్ బోట్లు దాడి చేయడం సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
News April 19, 2026
IPL: అద్భుత విజయం

IPL-2026: గెలుపు అసాధ్యం అనుకున్న దశలో KKR అద్భుత విజయం సాధించింది. RR నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యఛేదనలో తొలుత వరుసగా వికెట్లు కోల్పోయింది. 70కే 5 వికెట్లు పడిన దశలో రింకూ (53*), అనుకుల్ రాయ్ (29*) బౌండరీలతో మ్యాచును గెలిపించారు. వీరిద్దరూ కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సీజన్లో KKRకు ఇదే తొలి విజయం.
News April 19, 2026
రేపు చంద్రబాబు బర్త్‌డే.. CDP రిలీజ్ చేసిన లోకేశ్

AP: రేపు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ CDP (కామన్ డిస్‌ప్లే పిక్చర్) రిలీజ్ చేశారు. అందులో ఐటీ కంపెనీలు, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు, అమరావతి, పేదలకు ఇళ్లు, పెన్షన్ల పంపిణీ, తల్లికి వందనం లాంటి పథకాల వివరాలను పొందుపర్చారు. అటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో రేపు ఉచిత భోజనం కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.76 లక్షల విరాళం అందించారు.


