News November 21, 2024

‘పుష్ప 2’:శ్రీలీల స్పెషల్ సాంగ్‌‌పై బిగ్ అప్డేట్

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీపై మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం 5.49 గంటలకు ‘కిస్సిక్’ సాంగ్ రిలీజ్ డేట్‌పై అప్డేట్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు వేశారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. డిసెంబర్ 5న మూవీ విడుదల కానుంది.

Similar News

News January 12, 2026

వృద్ధుల కోసం డేకేర్ సెంటర్లు.. నేడే ప్రారంభం

image

TG: ఒంటరితనంతో బాధపడుతున్న 60yrs+ వృద్ధుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 37 ‘ప్రణామ్’ డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. నేడు ప్రజాభవన్‌లో CM రేవంత్ వర్చువల్‌గా 18 సెంటర్లను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల్లో హెల్త్ చెకప్, యోగా, మెడిటేషన్, టీవీ, కంప్యూటర్, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. హాలిడేలు మినహా మిగతా రోజుల్లో (9am-6pm) పనిచేస్తాయి. అటు చిన్నారుల కోసం <<18381207>>’బాల భరోసా’<<>> స్కీమ్‌నూ CM ఈరోజు ప్రారంభిస్తారు.

News January 12, 2026

మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ అమీర్‌పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు ఆమె నివాసానికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. కాగా రోశయ్య 2021లో మరణించారు. ఆయన 2009-10 మధ్య ఏపీ సీఎంగా పనిచేశారు. 2011-16 మధ్య తమిళనాడు గవర్నర్‌గా సేవలందించారు.

News January 12, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ రివ్యూ & రేటింగ్

image

విడిపోయిన భార్యాభర్తలు తిరిగి ఎలా కలిశారనేది MSVPG స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్‌లో వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది. చిరు-వెంకీ కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయి. అనిల్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రెగ్యులర్ స్టోరీ, ముందే ఊహించగల కొన్ని సీన్లు మైనస్.
రేటింగ్: 3/5