News November 21, 2024

తొలిసారి ఉక్రెయిన్‌పై మిసైల్ దాడి చేసిన రష్యా

image

ఉక్రెయిన్ క్షిపణి దాడులకు రష్యా ప్రతీకార దాడులు ఆరంభించింది. డినిట్రో సిటీ లక్ష్యంగా ICBM క్షిపణిని ప్రయోగించింది. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలయ్యాక పుతిన్ సేన మిసైల్‌ను ప్రయోగించడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈస్ట్రన్ ఉక్రెయిన్‌లోని డల్నె గ్రామాన్ని రష్యా సేనలు ఆక్రమించాయని కీవ్ తెలిపింది.

Similar News

News January 14, 2026

173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (<>UCO<<>>) 173 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, MBA, PG డిప్లొమా, IIBF/NIBM, ICAI, BE/BTech, MCA, MSc(cs) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.800, SC, ST, PwBDలకు రూ.175. రాత పరీక్ష/స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uco.bank.in

News January 14, 2026

నేడే జ్యోతి దర్శనం.. కిక్కిరిసిన శబరిగిరులు

image

అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది. సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

News January 14, 2026

‘మన శంకర‌వరప్రసాద్ గారు’ 2 డేస్ కలెక్షన్లు ఎంతంటే?

image

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర‌వరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లో రూ.120కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. తొలి రోజు ప్రీమియర్స్‌తో కలిపి రూ.84కోట్లు సాధించిన విషయం తెలిసిందే. మూవీకి పాజిటివ్ టాక్ రావడం, పండుగ సెలవుల నేపథ్యంలో ఈ వారం కలెక్షన్లు భారీగా పెరిగే ఛాన్సుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.