News November 21, 2024

ధనుష్-ఐశ్వర్య విడాకులపై తుది తీర్పు ఆరోజే..

image

తమ విడాకుల కేసు విచారణ కోసం నటుడు ధనుష్-ఐశ్వర్య రజినీకాంత్ ఈరోజు చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. వారు మళ్లీ కలవబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి దీంతో ఫుల్‌స్టాప్ పడింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి తుది తీర్పును ఈ నెల 27కి వాయిదా వేశారు. 2004లో వీరిద్దరికీ పెళ్లైంది. యాత్ర, లింగా అనే ఇద్దరు కుమారులున్నారు. తాము విడిపోనున్నట్లు 2022, జనవరి 17న సోషల్ మీడియా వేదికగా ధనుష్ ప్రకటించారు.

Similar News

News November 24, 2024

బలపడిన అల్పపీడనం.. 27 నుంచి భారీ వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని APSDMA వెల్లడించింది. ఇది రేపు వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయవ్య దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదులుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 27 నుంచి 30 వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

News November 24, 2024

IPLలో రికార్డ్ ధరలు.. ఇద్దరూ ఇండియన్సే!

image

రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ IPL-2025 వేలంలో రికార్డు ధర పలికారు. పంత్‌ను లక్నో రూ.27 కోట్లు, అయ్యర్‌ను రూ.26.75 కోట్లకు పంజాబ్ సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధిక ధర పలికిన వీరిద్దరూ టీమ్‌ఇండియా బ్యాటర్లు కావడం విశేషం. మొన్నటి వరకు స్టార్క్ రూ.24.75 కోట్లతో ఖరీదైన ప్లేయర్‌గా ఉన్నారు. ఇండియన్ లీగ్‌లో ఇతర దేశాల ప్లేయర్లకు భారీగా వెచ్చించడం పట్ల గతంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

News November 24, 2024

అక్కడ ఆఫీసర్ల కంటే ఖైదీలకే జీతాలెక్కువ..!

image

యూకేలోని జైళ్లలో ఖైదీల ఆదాయం అక్కడి అధికారులు, టీచర్ల కంటే ఎక్కువగా ఉంది. ఒక్కో ఖైదీ ఏడాదికి సుమారుగా రూ.39 లక్షలు సంపాదిస్తారు. కొంచెం పని తక్కువ చేసే ఖైదీలు ఏటా రూ.24 లక్షలు గడిస్తారు. ఇది అక్కడి జైలు గార్డు జీతంతో దాదాపుగా సమానం. గార్డులకు రూ.29 లక్షల వరకు జీతమిస్తారు. కాగా అక్కడి ఖైదీలు జైల్లో నుంచి బయటకు వెళ్లి పనులు చేసుకోవచ్చు. లారీ, బస్సు డ్రైవర్లుగా కూడా వారు పనిచేస్తున్నారు.