News November 21, 2024
ఏపీలో ప్రతి నేరం వెనుక గంజాయి బ్యాచ్: సీఎం చంద్రబాబు
AP: గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని CM చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దానివెనుక గంజాయి బ్యాచ్ ఉందన్నారు. నాసిరకం మద్యం విక్రయించడం వల్లే ప్రజలు గంజాయికి అలవాటు పడ్డారని చెప్పారు. విద్యాసంస్థల ప్రాంగణాలకు కూడా గంజాయి, డ్రగ్స్ చేరాయని ఆరోపించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2024
భారీ స్కోర్‌పై భారత్ కన్ను
BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుపై భారత్ కన్నేసింది. జైస్వాల్(90), KL రాహుల్(62) రాణింపుతో 172/0తో పటిష్ఠమైన స్థితిలో రెండో రోజు ఆట ముగించింది. ప్రస్తుతం 218 లీడ్‌లో ఉన్న భారత్ 3వ రోజంతా బ్యాటింగ్ చేసి కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆసీస్‌పై ఒత్తిడి పెరిగే ఛాన్సుంది. మరి భారత్ ఎంత స్కోర్ కొడుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.
News November 24, 2024
CM కుర్చీ కోసం ‘ముగ్గురు మొనగాళ్లు’
మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కూటమిలోని BJP 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, NCP 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడణవీస్ CM కావడం పక్కా అని BJP అంటుంటే, శిండే నేతృత్వంలోని శివసేన సైతం CM విషయంలో తగ్గేదేలే అంటోంది. అటు NCP అజిత్ పవార్ కూడా CM కుర్చీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు.
News November 24, 2024
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.