News November 21, 2024
హోంమంత్రికే రక్షణ లేకపోతే ఎలా?: సీఎం చంద్రబాబు
AP: తల్లి, చెల్లిని SMలో అసభ్యంగా దూషించినా గత సీఎం పట్టించుకోలేదని CM చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికీ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘ప్రస్తుతం హోంమంత్రి, డిప్యూటీ సీఎంపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. దళిత మహిళ అయిన హోంమంత్రికే రక్షణ లేకుండా పోతే ఎవరికుంటుంది? కొందరికి డీజీపీ, మంత్రులైనా లెక్కలేకుండా పోయింది. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
Similar News
News November 24, 2024
CM కుర్చీ కోసం ‘ముగ్గురు మొనగాళ్లు’
మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కూటమిలోని BJP 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, NCP 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడణవీస్ CM కావడం పక్కా అని BJP అంటుంటే, శిండే నేతృత్వంలోని శివసేన సైతం CM విషయంలో తగ్గేదేలే అంటోంది. అటు NCP అజిత్ పవార్ కూడా CM కుర్చీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు.
News November 24, 2024
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.
News November 24, 2024
IPL వేలం: ఇతనిపైనే అందరి చూపు
ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌పై అందరి దృష్టి ఉంది. ఈ వేలంలో ఆయనే అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. రాహుల్, శ్రేయస్, అర్ష్‌దీప్, ఇషాన్, షమీ వంటి ప్లేయర్లు కూడా అధిక ధర పలికే అవకాశముంది. గత సీజన్‌లో స్టార్క్ అత్యధికంగా రూ.24.75 కోట్ల ధర పలకగా ఈసారి సరికొత్త రికార్డులు నమోదవుతాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.