News November 21, 2024
ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్: సీఎం చంద్రబాబు
AP: రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని CM చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. పోలీసుల కోసం 2వేలకు పైగా కొత్త వాహనాల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. పోలీస్ శాఖకు వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను త్వరలోనే రిలీజ్ చేస్తామన్నారు. సైబర్ నేరాల కట్టడికి ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని, రాజకీయ ముసుగులో నేరాలు చేసే వాళ్లను వదిలేది లేదని స్పష్టం చేశారు.
Similar News
News November 24, 2024
రేపటి నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. సమావేశాల నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. మరోవైపు పార్లమెంట్ పాత భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.
News November 24, 2024
ఎన్టీఆర్ ‘మన దేశం’కు 75 ఏళ్లు
ఎన్టీఆర్ సినీ జీవితం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయ్యాయి. 1949 నవంబర్ 24న ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ విడుదలైంది. ఈ సినిమా కోసం కొత్త ముఖాలను ఎంపిక చేసే క్రమంలో ఒడ్డు, పొడుగు, చక్కటి వాచకం, గంభీర స్వరం ఉన్న ఎన్టీఆర్‌ను దర్శకుడు ఎల్వీ ప్రసాద్ తీసుకున్నారు. ఇందులో NTR పోలీస్‌గా నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సినిమాలు, స్టూడియోలు, రాజకీయాలతో తన జీవితమంతా బిజీబిజీగా గడిపారు.
News November 24, 2024
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అబ్బయ్య ఉమ్మడి ఏపీలో బూర్గంపాడు నుంచి 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 1994, 2009లో ఇల్లందు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.