News November 21, 2024
మండలి ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించిన బీటీ నాయుడు

టీడీపీ శాసనమండలి ఉపనాయకుడు బీటీ నాయుడు మండలి సమావేశం సందర్భంగా గురువారం శాసనమండలిలో ప్యానల్ స్పీకర్‌గా వ్యవహరించారు. సభను సజావుగా నడిపించారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. శాసనమండలిలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై మండలిలో పోరాటం చేశామన్నారు. బీటీ నాయుడు మండలి సమావేశంలో హుందాగా సభను నిర్వహించి సభ్యుల మన్ననలు పొందారు.
Similar News
News January 13, 2026
కర్నూలు: ‘రూ.8 వేలతో కొంటాం’

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటి ద్వారా క్వింటాకు రూ.8,000 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని మార్కెట్ యార్డ్ కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. కంది పంట నమోదు చేసిన ఈ-క్రాప్ సర్టిఫికెట్‌తో పాటు తేమ శాతం పరీక్షకు కందుల శాంపిల్ తీసుకొని రావాలని రైతులను సూచించారు.
News January 12, 2026
సౌత్ జోన్ స్థాయి ఫుట్‌బాల్ విజేత అనంతపురం ఆర్డీటీ

కర్నూలులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజులుగా నిర్వహిస్తున్న సౌత్ జోన్ స్థాయి మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంటులో అనంతపురం ఆర్డీటీ జట్టు చెన్నై యాసిస్ క్లబ్ జట్టుపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది. మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు త్రీ టౌన్ సీఐ శేషయ్య, కేవీఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా శాంతి అందజేశారు.
News January 12, 2026
అక్షరాంధ్రతో జిల్లాలో అక్షరాస్యత పెంపు: కలెక్టర్

కర్నూలు జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అక్షరాస్యత శాతాన్ని పెంచాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలోని 1.61 లక్షల నిరక్షరాస్యులకు వాలంటీర్ల ద్వారా చదువు నేర్పించి, మార్చి 29న జరిగే పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి, ఉత్తీర్ణులకు సర్టిఫికెట్లు అందించి ప్రోత్సహించాలని సూచించారు.


